Mowgli glimpse: మోగ్లీ కోసం నాని.. ఒక చిన్న ప్రేమ కథ చెప్తా అంటూ వీడియో రిలీజ్ చేసిన టీమ్

by Chukka Sudharani |

మొదటి చిత్రంతోనే నటనతో తనకంటూ స్పెషల్ ఈమేజ్ క్రియేట్ చేసుకున్నాడు స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల.

Mowgli glimpse: మోగ్లీ కోసం నాని.. ఒక చిన్న ప్రేమ కథ చెప్తా అంటూ వీడియో రిలీజ్ చేసిన టీమ్
X

దిశ, సినిమా: మొదటి చిత్రంతోనే నటనతో తనకంటూ స్పెషల్ ఈమేజ్ క్రియేట్ చేసుకున్నాడు స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల. ఇప్పుడు ఈ యంగ్ హీరో తన నెక్ట్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ‘మోగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మాణంలో ‘కలర్ ఫొటో’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతుంది.

దీంతో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన చిత్ర బృందం మూవీపై ప్రేక్షకుల్లో మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మోగ్లీ కోసం నేచురల్ స్టార్ నాని అంటూ ఆగస్టు 29న ఆయన నరేట్ చేసిన గ్లింప్ రాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. లింక్


Next Story