- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి కోసం సిద్ధం అవుతోన్న హీరోలు.. ఏకంగా ఎన్ని సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయంటే?
ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు నిలుస్తుంటాయి.

దిశ, సినిమా: ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు నిలుస్తుంటాయి. వాటిలో పెద్దా, చిన్నా హీరోలు అనే తేడా లేకుండా కంటెంట్ నచ్చితే సూపర్ హిట్ సక్సెస్‌ను ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం.. ఎన్నో సినిమాలను దాటుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అలాగే వచ్చే ఏడాది (2026)కోసం కూడా పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి వచ్చే ఏడాది ఏ హీరోలు బాక్సాఫీస్ వద్ద వార్‌కు సిద్ధం అవుతున్నారో చూద్దాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 9న రిలీజ్ కాబోతోంది. అలాగే జనవరి 9న మరో చిత్రం కూడా రిలీజ్ కానుంది. తమిళ స్టార్ విజయ్ తలపతి నటిస్తున్న మూవీ ‘జన నాయకుడు’ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుండటం విశేషం. ఇక జనవరి 12న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ విడుదలకు రాబోతున్నది. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దీనిపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వీటితో పాటుగా రవితేజ, కిషోర్ తిరుమల ఫ్యామిలీ కామెడీ ‘RT76’ జనవరి 13న.. నవీన్ పొలిశెట్టి కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒకరాజు’ జనవరి 14న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుండగా.. శర్వానంద్ ‘నారినారి నడుమ మురారి’ మూవీని కూడా సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే.. ఈ డేట్‌పై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.






