- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Priyanka Chopra: ఆ అనుభూతి ఎప్పుడూ ప్రత్యేకమే.. ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, సినిమా: బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కు చెక్కేసిన అందాల తార ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. ప్రజెంట్ అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘SSMB29’ లో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఓటీటీ, థియేటర్ల గురించి చెప్పుకొచ్చింది.
‘థియేటర్స్ (Theaters), ఓటీటీ (OTT) ప్లాట్ ఫామ్స్ రెండూ కూడా ఆడియన్స్‌ను ఎంతో ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. 24 గంటలు ఎన్నో విధాలుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. అయితే.. బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడడం అనేది ఎప్పుడూ ప్రత్యేకమైన ఫీల్‌ను కలిగిస్తుంది. చీకటిగా ఉండే ప్రదేశంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతోపాటు తెలియని ఎంతో మంది వ్యక్తుల మధ్యలో కూర్చొని చూస్తే సినిమా అద్భుతమైన అనుభూతినిస్తుంది. అంత పెద్ద స్క్రీన్, డిజిటల్ సౌండ్, థియేటర్ వాతావరణం అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అందుకే ఓటీటీలు వచ్చినప్పటికీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పటికీ స్పెషల్‌గానే ఉంటుంది. త్రీడీ, ఐమాక్స్‌లలో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఇవి ప్రేక్షకులకు సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను పెంచేందుకు యూస్ అవుతున్నాయి’ అని చెప్పుకొచ్చింది.