పెద్ది నుంచి ఓ కీ క్యారెక్టర్‌ను రివీల్ చేస్తున్నామంటూ మూవీ టీమ్ పోస్ట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by I. Sairam |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’.

పెద్ది నుంచి ఓ కీ క్యారెక్టర్‌ను రివీల్ చేస్తున్నామంటూ మూవీ టీమ్ పోస్ట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక దీన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్ అన్నీ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మార్చి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘పెద్ది నుండి ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు ఒక కీలక పాత్ర రానుంది.. చూస్తూ ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఎవరి క్యారెక్టర్ రివీల్ చేస్తారా అని ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ నెలకొన్నది.

Link

Next Story