Peddi : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పెద్దిపై మరో అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్ (పోస్ట్)

by Chukka Sudharani |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’.

Peddi : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పెద్దిపై మరో అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్ (పోస్ట్)
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే.. పెద్ది గ్లింప్స్‌లో రామ్ చరణ్ లుక్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘పెద్ది’ షూటింగ్‌పై మరోసారి అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ‘పెద్ది ప్రస్తుతం ఎడిట్ ప్రోసస్‌లో ఉంది. షూటింగ్ అండ్ ఎడిటింగ్ ఒకేసారి జరుపుతూ చిత్ర బృందం 24 గంటలూ పనిచేస్తోంది. సినిమా నిర్మాణం సగం పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ది మార్చి 27, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. కాగా.. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇందులో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేందుకు శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Link


Next Story