ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. వైరల్ అవుతున్న షాకింగ్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-17 07:21:19  IST  )

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్(NTR) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన బాలీవుడ్‌లోనూ ఓ భారీ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యారు.

ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. వైరల్ అవుతున్న షాకింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో ఎన్టీఆర్(NTR) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన బాలీవుడ్‌లోనూ ఓ భారీ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యారు. హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్-2’ చిత్రంలో కీలక పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అయితే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీతో పాటు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాను మైత్రీ మైవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ మ్యూజిక్ హక్కులను ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. ఇందులో మలయాళ యంగ్ హీరో టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రలో నటిస్తుండగా.. రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అయితే తారక్ నటిస్తున్న 31 సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. చిత్రబృందం వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు ఆయన బర్త్ డే మే 20న బిగ్ అప్డేట్ రాబోతుందని భావించారు. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేసి అందరికీ షాకిచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు సంబంధించిన గ్లింప్స్ మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. వార్ 2 నుంచి అప్డేట్ వస్తోంది కదా.. వార్ మీదున్న గౌరవంతో మా మాస్ మిస్సైల్‌ను పోస్ట్ పోన్ చేస్తున్నాం.. సరైన టైం చూసి మాస్ మిస్సైల్‌ను దించుతాం అని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీస్ ప్రకటించింది. ఈ ట్వీట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్ 2 వస్తే.. నీల్ అప్డేట్ ఇవ్వకూడదని ఏమైనా ఉందా? రెండు అప్డేట్లు వస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా? అని అభిమానులు ఫైర్ అవుతున్నారు.


Next Story