- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊహించని కాంబోలో సినిమా ఫిక్స్.. హైప్ పెంచుతున్న ట్వీట్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli)వరుస హిట్స్ సాధిస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli)వరుస హిట్స్ సాధిస్తున్నారు. వాల్తేరు వీరయ్య, జై లవ కుశ వంటి సినిమాలు తెరకెక్కించిన ఆయన వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇటీవల బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మహారాజ్’ (daaku maharaj) బాక్సాఫీసును షేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ స్టార్ హీరోతో మూవీ చేయనున్నట్లు సమాచారం. హృతిక్ రోషన్(Hrithik Roshan), బాబీ కొల్లి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ విషయం గురించి వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు టాక్. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారట.
అయితే ఈ సినిమాతోనే బాబీ హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా ఊహించని కాంబో అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘వార్-2’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ 2019లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘వార్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రజెంట్.. షూటింగ్ జరుపుకుంటున్న ‘వార్-2’ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది.






