- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kona Venkat: బాబీ-హృతిక్ కాంబోలో మూవీ రానుంది.. స్టోరీ విన్నాక ఆయన ఏమన్నారో తెలుసా?
కోన వెంకట్ మాట్లాడుతూ... బాబి కొన్ని రోజుల క్రితం 'హృతిక్ రోషన్'కు ఓ కథ చెప్పాడు. అది ఆయనకు అద్భుతంగా నచ్చి సినిమా చేయడానికి ఓకే అన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఆ చిత్రం స్టార్ట్ అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కథా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ కోన వెంకట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈయన బాబీ సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే విషయంలో చాలా సహాయం చేస్తూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కోన, బాబి తదుపరి మూవీలకు సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ రైటర్ మాట్లాడుతూ... బాబి, చిరంజీవితో చేయబోయే సినిమా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు చిరంజీవి గారు తన కెరీర్లో ఎప్పుడూ చేయని విధంగా ఆయన పాత్ర ఉండబోతుంది.
మీరు కొత్త చిరంజీవిని ఆ చిత్రంలో చూస్తారు అని చెప్పకచ్చాడు. ఇదే ఇంటర్వ్యూలో బాబి నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా ఈయన తెలియజేశాడు. బాబి తన నెక్స్ట్ మూవీని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఆయనకు కథను వినిపించాడు, కథ మొత్తం విన్నాక ఆయన సర్ప్రైజ్ అయ్యాడు. బాబిని నువ్వు ఏం తింటావు, ఏం ఎక్సర్సైజ్ చేస్తావు, ఇలాంటి ఐడియాలు నీకు ఎలా వచ్చాయి, అంటూ ఆయనను అడిగాడు.
అలాగే కథ పూర్తయ్యాక బాబీతో ప్రేమలో పడిపోయాడు, లవ్ చేయడం మొదలుపెట్టాడు. అంతలా ఆయనకు బాబి చెప్పిన కథ నచ్చింది, మరి కొంత కాలంలోనే ఆ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది అని రైటర్ చెప్పుకొచ్చాడు. కోన వెంకట్, బాబి తన నెక్స్ట్ మూవీని హృతిక్ తో చేయనున్నాడు, ఆయనకు స్టోరీ అద్భుతంగా నచ్చింది అని చెప్పడంతో చాలామంది చిరు సినిమాతో గనుక ఆయన మంచి విజయాన్ని అందుకొని, ఆ తర్వాత హృతిక్ తో కూడా సక్సెస్ కొట్టినట్లయితే ఇండియా రేంజ్ లో బాబీ పేరు మారుమోగుతుంది అని చాలామంది భావిస్తున్నారు.






