- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Producer SKN: సినిమా బిజినెస్ బాలేదు.. ఆవేదన వ్యక్తం చేసిన ప్రముఖ నిర్మాత
సినీ కార్మికుల వేతనాల పెంపుపై ప్రజెంట్ ఇండస్ట్రీలో ఇష్యూ నడుస్తుంది.

దిశ, సినిమా: సినీ కార్మికుల వేతనాల పెంపుపై ప్రజెంట్ ఇండస్ట్రీలో ఇష్యూ నడుస్తుంది. 30% వేతనం పెంపును వ్యతిరేకిస్తూ, తమ కష్టాలను వివరిస్తూ నిర్మాత ఎస్‌కేఎన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘బాలే.. సినిమా బిజినెస్ బాలే. సినిమా అంటే నమ్మకం. అలాగే అమ్మకం కూడా. అమ్మాలి అంటే కొనేవాళ్లు ఒక రేట్ చెప్తున్నారు. ఈ రేట్‌లో అందరూ బ్రేకెన్ అవ్వాలంటే కుదరదు. అయితే.. ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ముగ్గురు మగాళ్లు, ఒక ఆడపిల్లా. అందరికి బట్టలు కొంటే బాలేదు.. సర్లే ఆడపిల్ల బయటకు వెళ్తే బాగోదు మంచి బట్టలు కుట్టిద్దాం అని అనుకుంటే.. మిగిలిన ముగ్గురు మగాళ్లు కూడా మాకు షూట్ కావాలంటే ఎక్కడ నుంచి చస్తాము.
అలాగే తక్కువ వేతనం ఉన్నవాళ్లకు పెంచుదాం అని అనుకుంటే.. పెంచితే అందరికి పెంచండి అంటే ప్రొడ్యూసర్స్ చావాలా. ముందు బయటకు వెళ్లే ఆడపిల్లకు మంచివి కుట్టిద్దాం.. తర్వాత మగపిల్లకు చూద్దాం అంటే.. మాకు కూడా ఇప్పుడే షూట్స్ కావాలంటే ప్రొడ్యూసర్స్ ఎలా చస్తారు. ప్రొడ్యూసర్స్ ఎవరు మాట్లాడం లేదు. ఏమన్నా మాట్లాడితే వందల కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లో, బిగ్ స్టార్స్‌తో తీసే ప్రొడ్యూసర్లో మాట్లడం వల్ల.. ప్రొడ్యూసన్ మొత్తం క్యాష్ ప్యాక్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్ అంతా క్యాష్ ప్యాక్ కాదు.. రైస్ ప్యాక్. అందరికి డబ్బులు కట్టి.. అందరికి డబ్బులు ఇచ్చి చివరికి ఇంటికి వెళ్లేటప్పుడు జోబులో రూపాయి ఉండటం లేదు’ అంటూ నిర్మాత ఎస్‌కేఎన్ ఆవేదన వ్యక్తం చేశారు.






