- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెస్పియన్ రూమర్స్‌పై స్పందించిన మౌనీ రాయ్.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్
మౌనీ రాయ్, దిశా గత కొద్ది కాలంగా వీరు రిలేషన్‌లో ఉన్నారని.. ‘లెస్పియన్స్’ అంటూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్‌ల విడాకుల వ్యవహారం గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరు తమ ఇష్టపూర్వకంగానే విడిపోతున్నామని వెల్లడించారు. అయినప్పటికీ వీరి విడాకుల వార్తలు నిత్యం ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మౌనీ రాయ్, సూరజ్ దిశా పటానీ కారణంగానే విడిపోయారంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాకుండా మౌనీ రాయ్, దిశా గత కొద్ది కాలంగా వీరు రిలేషన్‌లో ఉన్నారని.. ‘లెస్పియన్స్’ అంటూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు కలిసి తరచూ వెకేషన్లకు వెళ్లడం, పార్టీలతో అత్యంత క్లోజ్‌గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లు అయింది. దిశా పటాని కోసమే తన నాలుగేళ్ల బంధాన్ని కూడా మౌనీరాయ్ వదులుకుందని టాక్.
ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై మౌనీరాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. దిశా పటానీతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోకు ఆమె ‘నా లిటిల్ సిస్టర్‌ను చాలా మిస్సవుతున్నాను’ అని క్యాప్షన్ పెట్టింది. తామిద్దరం లెస్బియన్స్ కాదు అక్కాచెల్లెళ్ల లాంటి స్నేహితులం అనే ప్రపంచానికి తెలియజేయాలనుకున్న మౌనీరాయ్ ఈ పోస్ట్‌ను కొద్దిసేపటికే డిలీట్ చేయడం గమనార్హం. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ వల్ల తొలగించిందా? లేక పొరపాటున ఆ క్యాప్షన్ పెట్టాననే ఉద్దేశంతో చేసిందా? అని చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరు గ్లామర్ క్వీన్స్ ఎంతగా క్లారిటీ ఇస్తున్నప్పటికీ వీరిద్దరు ‘లెస్బియన్స్’ అంటూ వస్తున్న పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు. మౌనీరాయ్ క్లారిటీ ఇవ్వబోయే కొత్త చిక్కు తెచ్చుకుందని చెప్పాలి. ప్రస్తుతం మౌనీ రాయ్ పోస్ట్ డిలీట్ చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది సస్పెన్స్‌గా మారింది.






