- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gurram Papireddy: డిఫరెంట్‌గా మోషన్ పోస్టర్.. ఆకట్టుకుంటోన్న ‘గుర్రం పాపిరెడ్డి’ లుక్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’ (Gurram Papireddy).

దిశ, సినిమా: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’ (Gurram Papireddy). డార్క్ కామెడీ కథ (Dark comedy story)తో రాబోతున్న ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తుండగా.. డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘గుర్రం పాపిరెడ్డి’ మూవీ మోషన్ పోస్టర్ పూర్తిగా కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. పర్పెక్ట్ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉండబోతుందో ఈ మోషన్ పోస్టర్ (Motion poster) చూపిస్తోంది. డిఫరెంట్‌గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్‌ను హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్‌లో కాంటెంపరరీగా, స్టైలిష్‌గా ప్రెజెంట్ చేశారు దర్శకుడు మురళీ మనోహర్. మోషన్ పోస్టర్‌లోని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్, కామెడీ హైలైట్‌గా నిలుస్తున్నాయి. కాగా.. చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.






