- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Baby Girl: ఆమె ఏడుపు తుఫానును రేకెత్తిస్తుంది.. బేబీ గర్ల్ నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్
మలయాళ దర్శకుడు అరుణ్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బేబీ గర్ల్’.

దిశ, సినిమా: మలయాళ దర్శకుడు అరుణ్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బేబీ గర్ల్’ (Baby Girl). ఈ సినిమాలో మొదట హీరోగా కుంచాకో బోబన్‌ను ఎంపిక చెయ్యగా.. ఇప్పుడు ఆ ప్లేస్‌లో నటిస్తున్నాడు నివిన్ పౌలీ (Nivin Pauly). దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో లిజోమోల్ జోస్, సంగీత్ ప్రతాప్ అండ్ మార్కో విలన్ అభియన్యు తిలకన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లిస్టిన్ స్టీఫెన్ తన మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చాడు హీరో నివిన్ పౌలీ. ‘బేబీ గర్ల్’ నుంచి మోషన్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు నివిన్. ‘ఆమె ఏడుపు తుఫానును రేకెత్తిస్తుంది. ఆమె హృదయ స్పందన విధిని మారుస్తుంది. బేబీ గర్ల్ మోషన్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్‌తో మా మొదటి అడుగు వేశాం’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. లింక్






