- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న తల్లి కొడుకు.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాత(Producer)గా వ్యవహరిస్తూ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi) కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే సోహెల్ ఖాన్(Sohail Khan), శ్రీకాంత్(Srikanth) కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ ఏప్రిల్ 18న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో తాజాగా కళ్యాణ్ రామ్, విజయశాంతి, మూవీ టీమ్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నుంచి సెకెండ్ సాంగ్ లాంచ్ చేశాము. అందుకోసం మేమందరం ఇక్కడికి వచ్చాము. దర్శనం అద్భుతంగా జరిగింది అని చెప్పుకొచ్చింది. అలాగే కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘మా మూవీని అందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని భావిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.






