- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు సినిమాలో హీరోయిన్‌గా మోనాలిసా.. టైటిల్ ఇదే!
మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ ఓ యువతి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆమె అందానికి ఫిదా అయిన నెటిజన్లు మోనాలిసా అంటూ పేరు పెట్టేశారు. అప్పట్లో మీడియా మొత్తం మోనాలిసా చుట్టే తిరిగింది. ఇక ఇప్పుడు ఆ యువతి సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ ఓ యువతి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆమె అందానికి ఫిదా అయిన నెటిజన్లు మోనాలిసా అంటూ పేరు పెట్టేశారు. అప్పట్లో మీడియా మొత్తం మోనాలిసా చుట్టే తిరిగింది. ఇక ఇప్పుడు ఆ యువతి సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే హిందీలో పాటలు, సినిమాల్లో నటిస్తుండగా ఇప్పుడు తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా టైటిల్ లైఫ్ కాగా, ఇందులో చరణ్ సాయి హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే చరణ్ సాయి ఇట్స్ ఓకే, క్రష్ చిత్రాలలో హీరోగా నటించాడు. లైఫ్ సినిమాను శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ పై అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని నిర్మిస్తున్నారు. నేడు సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించగా సీనియర్ హీరో సురేష్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు చిత్రయూనిట్ చెబుతోంది. మరి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మోనాలిసాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.






