Balakrishna: బాలకృష్ణ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ మూవీ.. వైరల్‌గా బాలయ్య బాబు లుక్ (పోస్ట్)

by Chukka Sudharani |

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న 109వ చిత్రం ‘డాకు మహారాజ్’ తో బిజీగా ఉన్నాడు.

Balakrishna: బాలకృష్ణ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ మూవీ.. వైరల్‌గా బాలయ్య బాబు లుక్ (పోస్ట్)
X

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న 109వ చిత్రం ‘డాకు మహారాజ్’ తో బిజీగా ఉన్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలకృష్ణ డైరెక్షన్‌లో తన వారసుడు మోక్షజ్ఞ సినిమా రాబోతున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ (Interesting News) నెట్టింట వైరల్ అవుతోంది. బాలకృష్ణ హీరోగా 1991 న వచ్చిన చిత్రం ‘ఆదిత్య 369’ (Aditya 369). సింగీతం శ్రినివాస రావు దర్శకత్వం వహించిన ఈ మూవీ టైం ట్రావెల్ కథంశంతో రూపొంది అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమాలో పాటలకు ఈ తరం కూడా కనెక్ట్ అవుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో శ్రీకృష్ణదేవరాయ (Sri Krishna Devaraya)లుగా బాలకృష్ణ పాత్ర ఎవర్‌గ్రీన్ (Evergreen) గా నిలిచింది.

అయితే.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ (sequel)కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ‘ఆదిత్య 999’ (Aditya 999) అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం స్క్రిప్ట్ పనుల్లో బాలయ్య నిమగ్నమై ఉన్నారని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఇంకో విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని బాలయ్య బాబే దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో మోక్షజ్ఞ హీరోగా నటించనున్నట్లు టాక్. అయితే.. బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో ఆయన ఆదిత్య 369 గెటప్‌లో కనిపించడమే ఇప్పుడు ఈ వార్తలు వైరల్ అయ్యేందుకు ప్రధానం కారణం. ఇప్పుడు నెక్ట్స్ ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో ‘ఆదిత్య 999’పై అనౌన్స్‌మెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

Next Story