- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mohanlal: ఫ్యాన్స్‌కు స్పెషట్ ట్రీట్.. మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్
మలయాళం(Malayalam)లో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్న సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal)..

దిశ, సినిమా: మలయాళం(Malayalam)లో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్న సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal).. ప్రస్తుతం తెలుగులో ‘కన్నప్ప’(Kannappa)లో నటిస్తున్నారు. డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ నుంచి మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ వీడియోలో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, కనిపించిన తీరు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్న ఈ గ్లింప్స్.. మోహన్‌లాల్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తుంది. దైవిక శక్తితో ముడిపడి ఉన్న కిరాత అనే పాత్రను మోహన్‌లాల్ పోషించారు. కాగా.. ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. దీంతో ప్రస్తుతం విష్ణు మంచు, కన్నప్ప టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూఎస్ టూర్‌ను పూర్తి చేశారు. కన్నప్ప నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ పోస్టర్‌లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకోగా.. మూవీపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.






