Mohanlal: చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.. 65 ఏళ్ల వయసులో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన స్టార్ హీరో

by Chukka Sudharani |

65 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు మలయాళ స్టార్ మోహన్ లాల్.

Mohanlal: చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.. 65 ఏళ్ల వయసులో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన స్టార్ హీరో
X

దిశ, సినిమా: 65 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు మలయాళ స్టార్ మోహన్ లాల్. ఈ ఏడాది ఎంపురాన్, కన్నప్ప, హృదయపూర్వం వంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఈయన.. ప్రస్తుతం ‘వృషభ, దృశ్యం 3’తో పాటు మరో రెండు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టాడు. ఇప్పుడు వాటితో పాటుగా.. తాజాగా మరో కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ X వేదికగా.. ‘చాలా ఆనందంతో నా నెక్ట్స్ చిత్రాన్ని ప్రకటిస్తున్నాను. ఈ సినిమాకు ఆస్టిన్ డాన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా.. రచయిత రితీష్ రవి. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు. ఈ ఉత్తేజకరమైన కొత్త అధ్యాయంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అని పోస్టర్ షేర్ చేశారు. Link

Next Story