- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కన్నప్ప’ రథసారథి విష్ణు కాదు.. ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు
కన్నప్ప సినిమా(Kannappa Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో నటుడు మోహన్ బాబు(Mohan Babu) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కన్నప్ప సినిమా(Kannappa Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో నటుడు మోహన్ బాబు(Mohan Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆ భగవంతుడి ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రం ప్రారంభమైంది. అంతా ఆ దేవుడి దయ వల్లే జరుగుతుంది. అభిమానుల ప్రేమ, ఆ దేవుడి ఆశీస్సులు నా బిడ్డ విష్ణుకి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితోనే ఈ చిత్రాన్ని తీశాం. ఈ మూవీలోని ప్రతీ పాత్ర హీరోలానే ఉంటుంది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. నేను మహా భారతం సీరియల్‌ను ఎన్నో సార్లు చూశాను. ‘కన్నప్ప’ సినిమాను కూడా ఆయన అంతే అద్భుతంగా తెరకెక్కించారు. రథ సారథిగా ముందుకు తీసుకెళ్లారు. ముఖేష్ రిషి కెరీర్ ఆరంభం నుంచీ మా ఫ్యామిలీతో ఉంటున్నారు. ఈ ఫంక్షన్‌కు గిరిజన ప్రతినిధుల్ని పిలవడానికి కారణం ఉంది. కులాలు, మతాలు అనేవి లేవు అని చెప్పడానికి అందరినీ పిలిచాం. సినిమాలో విష్ణు చేసిన తిన్నడు క్యారెక్టర్ బోయ కులానికి చెందినది. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నదే ఈ కథ. ఆకెళ్ల ఈ చిత్రానికి అద్భుతమైన మాటలు అందించారు. ఆ శివుడి ఆశీస్సులతో మే 27న రాబోతోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని మోహన్ బాబు అన్నారు.






