కన్నప్పను ట్రోల్ చేసిన వాళ్లంతా ఆరోగ్యంగా ఉండాలి - మోహన్ బాబు

by velandi.Saikiran |   (  Updated:2025-07-13 01:39:29  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. పాన్ ఇండియా రేంజ్ లో... వచ్చిన ఈ సినిమా మొన్న

కన్నప్పను ట్రోల్ చేసిన వాళ్లంతా ఆరోగ్యంగా ఉండాలి - మోహన్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. పాన్ ఇండియా రేంజ్ లో... వచ్చిన ఈ సినిమా మొన్న జూన్ 27వ తేదీన రిలీజ్ అయి.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. హీరోగా మంచి విష్ణు చేయగా ప్రత్యేక పాత్రలో ప్రభాస్ కూడా నటించారు. ప్రొడ్యూసర్ గా మోహన్ బాబు ఉన్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ ఇంకా చాలామంది స్టార్ నటులు ఉన్నారు.

అయితే సినిమా గత నెలలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా... కొంతమంది ఈ సినిమాను ఉద్దేశించి ట్రోలింగ్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ నేపథ్యంలో.. తాజాగా మంచు మోహన్ బాబు స్పందించారు. కన్నప్ప సినిమాను ట్రోలింగ్ చేసిన వారు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. విమర్శ అలాగే సద్విమర్శ... అనేవి చాలా సహజమని తేల్చి పారేశారు.

సినిమాపై నెగిటివ్ టాక్స్ రావడం... ట్రోలింగ్ చేయడం కామన్ అయిపోయిందన్నారు. నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ కర్మానంత ట్రోలర్లు తీసుకు వెళుతున్నారని ఓ పండితుడు నాతో అన్నట్లు వ్యాఖ్యానించారు. ఇక వారిని ఆశీర్వదించమని ఆయన చెప్పినట్లు గుర్తు చేశారు. ట్రోల్ చేసేవారు అలాగే వాళ్ళ అమ్మానాన్నలు బాగుండాలని... సెటైర్లు పేల్చుతూ మంచి మోహన్ బాబు కామెంట్ చేశారు.

Next Story