మోహన్ బాబు అలాంటి వ్యక్తి.. సెట్లో అలా చేసేవారు: షాకింగ్ విషయాలు చెప్పిన అజయ్ భూపతి

by Pulgam srinivas |

మోహన్ బాబు గారు... నీ సినిమా కోసం ఎన్ని రోజులైనా వస్తాను... ఏదైనా చేస్తానని అన్నట్లు అజయ్ భూపతి చెప్పారు.

మోహన్ బాబు అలాంటి వ్యక్తి.. సెట్లో అలా చేసేవారు: షాకింగ్ విషయాలు చెప్పిన అజయ్ భూపతి
X

దిశ, వెబ్ డెస్క్: 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ఈ చిత్రంలో రషా తడాని కథానాయికగా నటించగా, మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో దర్శకుడు అజయ్ భూపతి మోహన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అజయ్ భూపతి మాట్లాడుతూ.. సీనియర్ లెజెండరీ నటుడు మోహన్ బాబు గారు మా సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఆయన గొప్ప నటుడు. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

అలాగే ఎన్నో విద్యాసంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అంతటి గొప్ప వ్యక్తి అయినప్పటికీ సెట్స్‌లో మాత్రం ఎంతో సింపుల్‌గా ఉండేవారు. దర్శకుడు ఏం చెబితే అది ఎలాంటి అభ్యంతరం లేకుండా చేసేవారు. ఆయన వల్ల ఒక్కరోజు కూడా మా షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. 'ఎన్ని రోజులు షూటింగ్‌కు రావాలన్నా వస్తాను.. ఎలా చేయమంటే అలా చేస్తానని అన్నారు. ఈ సినిమా విషయంలో ఎవరికైనా 'ఐ లవ్ యూ' చెప్పాలంటే ఇద్దరికే చెబుతాను. ఒకరు మా హీరో జయకృష్ణ ఘట్టమనేని, మరొకరు మోహన్ బాబు గారు. అంతలా ఆయన నాకు అండగా నిలిచారని అజయ్ భూపతి అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story