‘మొగుడు’గా విశాల్.. భార్యగా తమన్నా.. మధ్యలో ఆ కమెడియన్.. నవ్వులే నవ్వులు..

by Sujitha Rachapalli |

తమిళ దర్శకుల్లో ‘సుందర్ C’ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన తీసిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నారు.

‘మొగుడు’గా విశాల్.. భార్యగా తమన్నా.. మధ్యలో ఆ కమెడియన్.. నవ్వులే నవ్వులు..
X

దిశ, సినిమా : తమిళ దర్శకుల్లో ‘సుందర్ C’ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన తీసిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నారు. అవ్ని సినీమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కుష్బూ సుందర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు A.C.S అరుణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘మొగుడు’ అనే టైటిల్‌తో రాబోతున్న చిత్రంలో విశాల్‌ సరసన తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కమెడియన్ యోగిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. మరోవైపు ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ యూనిట్ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఏకంగా 5 నిమిషాల నిడివితో ఈ వీడియో కట్ చేసి ఒక్కసారిగా సినిమాపై హైప్ తీసుకొచ్చారు. ఇందులో విశాల్- తమన్నాలను భార్యాభర్తలుగా చూపిస్తూనే సినిమాలో డెప్త్ ఏంటనేది క్లియర్‌గా చెప్పేశారు. యోగి బాబు రోల్ మరో హైలైట్.

Next Story