- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్లలో ‘మోదీ’ మేనియా.. ‘ధురందర్ 2’లో ప్రధాని ఎంట్రీకి ప్రేక్షకుల పూనకాలు
‘ధురందర్ 2’ సినిమాలో ప్రధాని నరేంద్ర మోదీ క్యామియోపై థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. రణవీర్ సింగ్ నటించిన ఈ చిత్రం తొలిరోజే రూ.కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యాక్షన్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ బంపర్ హిట్ కొట్టింది. సినిమాలో ఉన్న ఒక సర్‌ప్రైజ్ ఎలివేషన్ కారణంగా సోషల్ మీడియా (Social Media)లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సినిమాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కనిపించడంతో థియేటర్లన్నీ ఈలలు, కేకలతో హోరెత్తుతున్నాయి. అయితే, చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)కి సంబంధించిన కొన్ని వాస్తవ దృశ్యాలను క్యామియో తరహాలో ఉపయోగించారు. మోదీ ప్రమాణ స్వీకార దృశ్యాలు, 2016 నాటి చారిత్రాత్మక నోట్ల రద్దు (Demonetization) ప్రసంగానికి సంబంధించిన క్లిప్పింగులు స్క్రీన్‌పై కనిపించగానే ప్రేక్షకులు సీట్లలోంచి లేచి గోల చేస్తూ హంగామా చేశారు.
వైరల్ వీడియోలు..
థియేటర్లలో ప్రేక్షకులు ‘మోదీ.. మోదీ..’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ‘థియేటర్లో వాతావరణం అద్భుతంగా ఉంది, మోదీ గారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ రెస్పాన్స్ చెబుతోంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నా.. ఈ సీన్లపై సోషల్ మీడియాలో కొంత విమర్శ కూడా వినిపిస్తోంది. నోట్ల రద్దు వంటి అంశాలను సినిమాలో చూపించడం రాజకీయ ప్రచారంలో భాగమేనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సెన్సార్ బోర్డు (CBFC) ఈ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ ఇస్తూ, కొన్ని సన్నివేశాలపై కత్తెర వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.






