Ram Charan: రామ్ చరణ్ ‘RC16’లో మీర్జాపూర్ నటుడు.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2024-12-01 15:09:42  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Ram Charan: రామ్ చరణ్ ‘RC16’లో మీర్జాపూర్ నటుడు.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రజెంట్ శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ చేంజర్’(Game Changer) మూవీ చేస్తున్నారు. ఇది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే బుచ్చిబాబు(Buchibabu Sana) డైరెక్షన్‌లో RC16 రాబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మైవీ మేకర్స్(Mythri movie makers) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ మైసూర్‌(Mysuru)లో జరుగుతుంది. ఈ క్రమంలో.. బుచ్చిబాబు ‘RC16’కు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. ఇటీవల స్టార్ నటుడు జగపతి బాబు(Jagapathi Babu) నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, బుచ్చిబాబు RC16 నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఇందులో ‘మీర్జాపూర్’(Mirzapur) ఫేమ్ మున్నా భయ్యా దివ్యేందు శర్మ(Divyendu Sharma) నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసి హైప్ పెంచారు. అయితే ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న దివ్యేందు(Divyendu Sharma) RC16లో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


Click Here For Twitter Post..


Read More...

Ram Charan: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘నానా హైరానా’ సాంగ్.. సరికొత్త రికార్డు (ట్వీట్)

Next Story