OG కోసం మిరాయ్ టీం సంచలన నిర్ణయం..థియేట‌ర్లు కూడా బ్లాక్‌ !

by velandi.Saikiran |

ప‌వన్ క‌ళ్యాణ్ కు రూట్ క్లియ‌ర్ చేసింది మిరాయ్ టీం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా మరికొద్ది గంటల్లో

OG కోసం మిరాయ్ టీం సంచలన నిర్ణయం..థియేట‌ర్లు కూడా బ్లాక్‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన OG సినిమా కోసం... థియేటర్లను ఇచ్చేసింది మిరాయ్ చిత్ర బృందం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా మరికొన్ని గంటల్లోనే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో.... హీరో తేజ సజ్జ హీరోగా చేసిన మిరాయ్ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం అంటే రేపటి రోజున... మిరాయ్ సినిమా నడిచే అన్ని థియేటర్లను... పవన్ కళ్యాణ్ చేసిన OG సినిమాకు అప్పగించనున్నారు.

రేపు OG సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో... గొప్ప మనసుతో మిరాయ్ చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే రేపు మిరాయ్ సినిమా నడిచే... అన్ని థియేటర్లలో ఓజి నడుస్తుంది అన్నమాట. ఆ తర్వాత శుక్రవారం నుంచి యధావిధిగా.. మిరాయ్ సినిమా అదే థియేటర్లలో నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది మిరాయ్ చిత్ర బృందం.

Next Story