దయచేసి అలాంటి సినిమాలు తీయకండి.. ఇండస్ట్రీ పెద్దలకు మంత్రి విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

తెలుగు చలనచిత్ర పరిశ్రమ(Telugu Film Industry)కు చెందిన ప్రముఖులకు మంత్రి సత్యకుమార్(Minister Satya Kumar Yadav) కీలక సూచనలు చేశారు.

దయచేసి అలాంటి సినిమాలు తీయకండి.. ఇండస్ట్రీ పెద్దలకు మంత్రి విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమ(Telugu Film Industry)కు చెందిన ప్రముఖులకు మంత్రి సత్యకుమార్(Minister Satya Kumar Yadav) కీలక సూచనలు చేశారు. శనివారం ఆయన నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని అన్నారు. బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీ(Smugglers' Biography)లతో సినిమా తీయడమేంటి? అని ప్రశ్నించారు. సమాజంలో ఇలాంటివి మంచిదికాదని అభిప్రాయపడ్డారు. జన్మించిన ఊరు, సమాజం కోసం శ్రమించే వాళ్ల కథలను సినిమాలుగా తీయాలని హితవు పలికారు.


అంతకుముందు అనంతపురంలో పర్యటించిన ఆయన కూటమిలో విభేదాలు మొదలయ్యాయంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతల మధ్య దూరం అనేది దుష్ప్రచారం అని కొట్టిపారేశారు. తాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నేతృత్వంలోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. పవన్ కళ్యాణ్ కోసం సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఫోన్‌లో సంప్రదించాలని చూశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ముందస్తు ప్రణాళిక ప్రకారం యాత్రకు వెళ్లారన్నారు. ఒక్కోసారి కేబినెట్ మీటింగ్‌లకు తాము కూడా వెళ్లలేకపోవచ్చని.. అంత మాత్రన విబేధాలు ఉన్నాయనడం సరికాదని చెప్పుకొచ్చారు.

Next Story