- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం
by Ajay Maddhiboyina |
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీర మల్లు సినిమా జూలై 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 21వ తేదీన వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీర మల్లు సినిమా జూలై 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 21వ తేదీన వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఈ ఈవెంట్‌కు హాజరవ్వాలని తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చిత్రయూనిట్ ఆహ్వానం పలికింది.
సినిమా నిర్మాత ఎ.ఎం రత్నం స్వయంగా కోటమిరెడ్డిని కలిసి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హాజరవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తరవాత ఈ సినిమా విడుదల కాబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్ హీరోగా నటించగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పిటికే విడుదలై సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. మరి భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
Next Story






