Tamannaah:‘ఈ హీరోయిన్ డ్యాన్స్‌కు అభిమానిని’.. మిల్క్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-04-16 14:31:54  IST  )

మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Tamannaah:‘ఈ హీరోయిన్ డ్యాన్స్‌కు అభిమానిని’.. మిల్క్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరోయిన్ తెలుగులో అనేక చిత్రాల్లో నటించి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ మొదట్లోనే తన అద్బుతమైన నటనకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ దక్కించుకుంది. అంతేకాకుండా అనేక అవార్డులను కూడా సంపాదించుకుంది. . హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, తడాఖా, బాహుబలి: ది బిగినింగ్, బెంగాల్ టైగర్, ఊపిరి, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, సైరా నరసింహా రెడ్డి వంటి ఎన్నో సినిమాల్లో నటించి జనాల్ని మెప్పించింది.

కేవలం ఈ అమ్మడు తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళం, హిందీ చిత్రాల్లో కూడా నటించి అక్కడి ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. ప్రజెంట్ తమన్నా అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ కోసం మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు. జనాల్లో భారీ హైప్ పెంచిన ఈ చిత్రం రేపు (ఏప్రిల్ 17) Odela2 థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుంది.

అయితే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్నానే పెద్ద డ్యాన్సర్ కదా...? మరీ ప్రజెంట్ మీకు నచ్చిన డ్యాన్సర్ ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్న ఎదురవ్వగా తమన్నా ఇలా బదులిచ్చింది. ‘‘అవును ఉన్నారు. తెలుగు హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన డ్యాన్స్‌కు నేను అభిమానిని’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మిల్క్ బ్యూటీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story