- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ రాత్రి మెర్సల్ మాస్ షో.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్
ఈ రోజు రాత్రి 10:45 గంటలకు “మెర్సల్” చిత్రానికి ప్రత్యేక షోను ప్రదర్శించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు తలపతి విజయ్ కొంతకాలం క్రితం “తమిళగ వెట్రి కళగం” (TVK) అనే రాజకీయ పార్టీని స్థాపించి, తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో పోటీలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఇందులో విజయ్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అయింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వివిధ రకాలుగా సంబరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం “మెర్సల్” ను ఈ రోజు రాత్రి 10:45 గంటలకు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ షోకు సంబంధించిన టికెట్ బుకింగ్‌లు కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. దీంతో విజయ్ అభిమానులు ప్రత్యేక సంబరాలకు సిద్ధమయ్యారు. ఇక “మెర్సల్” చిత్రంలో విజయ్ సరసన కాజల్ అగర్వాల్, సమంత, నిత్యా మీనన్ నటించగా, అట్లీ కుమార్ దర్శకత్వం వహించారు. ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది.






