- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇదేం క్రియేటివిటిరా బాబూ’.. ఆ సినిమా డైరెక్టర్ చూస్తే కడుపుబ్బా నవ్వుకోడం ఖాయం (వీడియో)
బడ్జెట్(Budget), కాస్ట్(Cast)తో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు అదరగొడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్(Budget), కాస్ట్(Cast)తో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు సత్తా చూపిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లో అదరగొడుతుంటే.. మరికొన్ని సినిమాలు థియేటర్లలో రాణిస్తున్నాయి. అంతేకాదు.. వేరే భాషల సినిమాలు కూడా తెలుగులో మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది విడుదలైన మంజుమ్మల్ బాయ్స్(Manjummel Boys Movie) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. మలయాళంలోనే కాకుండా.. తెలుగు, తమిళ్‌లో కూడా అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో మీమ్స్(Memes) కూడా అదే రేంజ్‌లో వచ్చాయి.
సినిమా వీక్షించిన వాళ్లంతా ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు.. పోస్టు రూపంలో తెలియజేయగా.. మరికొందరు మీమ్స్ రూపంలో చెబుతున్నారు. ముఖ్యంగా లోయలో పడిపోయిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చే సీన్‌ను రీక్రియేట్ చేస్తున్నారు. కొందరైతే.. బావుల వద్ద, చెరువుల వద్ద నీటిలో మునిగి తేలుతూ వీడియోలు చేస్తుండగా.. ఒకడైతే.. చాయ్‌లో మునిగిన బిస్కెట్‌ను బయటకు తీస్తూ మీమ్స్ చేశారు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ సినిమా పాట వేయడం హైలైట్. ఈ పోస్టు కింద నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ‘ఇదేం క్రియేటివిటిరా బాబూ’.. మంజుమ్మల్ బాయ్స్ సినిమా డైరెక్టర్(Manjummel Boys Film Director) చూస్తే కడుపుబ్బా నవ్వుకోడం ఖాయం అంటూ పేర్కొంటున్నారు.
సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు నటించిన ఈ మంజుమ్మల్ బాయ్స్ చిత్రం 2024, ఏప్రిల్ 6వ తేదీన విడుదలైంది. దీనికి సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు. చిదంబరం దర్శకత్వం వహించగా.. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) వారు విడుదల చేశారు. రూ.20కోట్ల పరిమిత బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.






