Brahmanandam : ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మీమ్స్ బ్రహ్మ

by Muthe.Rajitha |

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బహ్మానందం(Brahmanandam) లేని తెలుగు మీమ్(Telugu Meme) కంటెంట్​ను ఎవరూ ఊహించలేరు.

Brahmanandam : ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మీమ్స్ బ్రహ్మ
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ కమెడియన్ బహ్మానందం(Brahmanandam) లేని తెలుగు మీమ్(Telugu Meme) కంటెంట్​ను ఎవరూ ఊహించలేరు. సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్, మరే కమెడియన్​కు లేదని చెప్పడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. అంతటి ఫాలోయింగ్​కలిగి ఉన్న ఆయన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలోకి వస్తే భలే సందడి ఉంటుంది కదా. దాన్ని నిజం చేస్తూ.. తన ఫ్యాన్స్​ను ఎంటర్టైన్ చేయడానికి బ్రహ్మానందం ఇన్స్టాగ్రామ్(Instagram)​లోకి ఎంట్రీ ఇచ్చారు. Yourbrahmanandam ఐడీతో ఆయన ఇన్స్టాలో ఇటీవలే అడుగుపెట్టారు. తన కుమారుడు గౌతమ్(Gowtham)​తో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్న మూవీ ప్రమోషనల్ ఈవెంట్​లో స్వయంగా ఆయనే ఇన్స్టా విషయాన్ని వెల్లడించారు. దీంతో మన మీమ్స్ బ్రహ్మ ఇన్స్టా ఐడీ మ్యాటర్ వైరల్ గా మారింది.

ఇటీవల గౌతమ్ సినిమా ప్రమోషన్స్ లో మీరు సోషల్ మీడియాలో ఉన్నారా? ఐడీ చెబితే బ్రేక్ ఇస్తాం! అంటూ అభిమానులు బ్రహ్మిని అడగ్గా తన ఇన్‌స్టా ఐడీ విషయాన్ని ఆయన అభిమానులు పంచుకున్నారు. తాను రాసిన పుస్తకం పేరు ఇట్లు మీ బ్రహ్మానందం అని, దాని ఇంగ్లిష్ రూపం అయిన Yourbrahmanandam ఐడీతోనే తాను ఇన్‌స్టాలోకి వచ్చానని బ్రహ్మి తెలిపారు. ఆయన ఇన్‌స్టాలోకి రాగానే పెద్ద ఎత్తున అభిమానులు ఆయన్ని ఫాలో అవ్వడం కూడా మొదలుపెట్టారు. బ్రహ్మి లేని మీమ్​ఒక్కటి కూడా ఉండదు. ఎలాంటి సందర్భంలో క్రియేట్ చేసిన మీమ్ అయినా ఆయన ఫొటో కచ్చితంగా ఉంటుంది. మరి ఇన్స్టాగ్రామ్​లోకి వచ్చిన బ్రహ్మానందం తన మీద మీమ్స్ చూసి ఎలా రెస్పాండ్ అవుతారో వెయిట్ అండ్ సీ అనుకోవాలి.

Next Story