- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాక్సిక్ నుంచి మెల్లిసా ఫస్ట్ లుక్ రిలీజ్.. మోడ్రన్ డ్రెస్సులో హైప్ పెంచుతున్న క్రేజీ బ్యూటీ..
రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’.

దిశ, వెబ్‌డెస్క్: రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యష్‌కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీటీమ్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘పెద్దల కోసం ఒక విషపూరిత అద్భుత కథ - ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌ను మెల్లిసాగా పరిచయం చేస్తున్నాము’ అంటూ రాసుకొచ్చారు.
ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. రుక్మిణి వసంత్ మోడ్రన్ డ్రెస్సులో పబ్‌లో స్టైలీష్‌గా నడస్తూ వస్తుండగా.. ఆమె చూట్టూ ఉన్న అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్‌ల లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నదియా పాత్రలో కియారా, ఎలిజబెత్‌గా హ్యుమా ఖురేషీ. గంగ పాత్రలో నయనతార నటించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
Read More..
బ్లాక్ డ్రెస్సులో వైట్ స్కిన్ కనిపించేలా హీరోయిన్ బోల్డ్ షో.. బ్యాక్ పార్ట్ అంతా అలా వదిలేసిందేంటి..






