రొమాంటిక్ & ఎమోషనల్.. ఆకట్టుకుంటోన్న మెహ్రీన్ పిర్జాదా ‘ఊరుమ్’ సాంగ్

by Chukka Sudharani |   (  Updated:2025-12-23 16:24:06  IST  )

హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా.. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.

రొమాంటిక్ & ఎమోషనల్.. ఆకట్టుకుంటోన్న మెహ్రీన్ పిర్జాదా ‘ఊరుమ్’ సాంగ్
X

దిశ, సినిమా: హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా.. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో నటించిన నటన పరంగా పర్వాలేదు అనిపించుకున్న ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, పంజాబీ వంటి భాషల్లో కూడా సినిమాలు చేసి అలరించింది. ఇక తెలుగులో లాస్ట్‌గా ‘ఎఫ్-2’ చిత్రంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తర్వలో ‘ఇంద్ర’ అనే చత్రంతో తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవోతుంది.

వసంత్ రవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సబరిష్ నంద దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను JSM పిక్చర్స్, ఎంపరర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుస్తుండగా.. రీసెంట్‌గా ‘ఊరుమ్’ ప్రోమో రిలీజ్ చెయ్యగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది ఈ బ్యూటీ. రొమాంటిక్ అండ్ ఎమోషనల్‌గా సాగిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతున్నట్లు తెలిపింది.

Next Story