మెగాస్టార్ జీవిత చరిత్రపై పుస్తకం.. కలలు నిజమవుతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-21 13:24:21  IST  )

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) వరుస సినిమాలతో ఇండస్ట్రీలో చరిత్ర సృష్టిస్తున్నారు.

మెగాస్టార్ జీవిత చరిత్రపై పుస్తకం.. కలలు నిజమవుతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) వరుస సినిమాలతో ఇండస్ట్రీలో చరిత్ర సృష్టిస్తున్నారు. ఇప్పటికీ మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఇక ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడరుమ్’(Tudarum) సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ఇక ప్రస్తుతం మోహన్‌లాల్ హృదయం, కన్నప్ప(Kannappa) వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా, మోహన్‌లాల్ పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ ద్వారా కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు.

‘‘నేడు నా పుట్టినరోజు సందర్భంగా మీతో కొన్ని అద్భుతమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలను రచయిత భానుప్రకాశ్ అక్షరరూపం ఇచ్చారు. ‘ముఖరాగం’ పేరుతో ఓ పుస్తకం కూడా రాబోతుంది. దీనికి మలయాళంలో నాకు అత్యంత ఇష్టమైన రచయిత వాసుదేవన్ నాయర్ ముందుమాట రాయగా.. ఇందులో గత 47 సంవత్సరాల నా నట జీవితంలో జరిగిన ఎన్నో అంశాల గురించి వివరించారు. నా జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రావాలని ఎంతో మంది కలలు కన్నారు. అవి ఇప్పుడు నిజమవుతున్నాయి. దాదాపు వెయ్యి పేజీల ఈ పుస్తకం డిసెంబర్ 25న మీ ముందుకు రాబోతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అది చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Next Story