- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ముఖ్యమంత్రికి స్పెషల్ థాంక్స్ చెబుతూ మెగాస్టార్ ట్వీట్.. కారణమేమిటంటే..?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) మూవీలో యాక్ట్ చేస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఫ్యామిలీ డైరెక్టర్ అనిల్ రావిపూడి(anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార(Nayanathara) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెంకటేష్(Venkatesh) దగ్గుబాటి కామియో రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఫ్యూచర్ సిటీలో మంగళవారం జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబట్ సమ్మిట్’ కార్యక్రమానికి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్లారు.
ఈ మేరకు నేడు తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి(C.M Revanth Reddy)కి ధన్యవాదాలు తెలుపుతూ తన ఎక్స్‌లో ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డితో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ‘నిన్న ఫ్యూచర్ సిటీలో జరిగిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన తెలంగాణ C.M శ్రీ.రేవంత్ రెడ్డికి నా ధన్యవాదాలు. “తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ లో భాగంగా.. అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి సైతం ప్రాముఖ్యతను ఇస్తూ.. హైదరాబాద్‌ను ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది.
ఈ మహత్తర కార్యాచరణలో నా దిశా నిర్దేశం కోరడం.. నాకు ఎంతో ఆనందదాయకం.C.M రేవంత్ రెడ్డి గారి విజన్ అలాగే ప్రభుత్వ ప్రోత్సాహంతో మన నుండి మరెన్నో “World Class Projects” రూపుదిద్దాలని, ప్రపంచ సినిమా హైదరాబాద్ పై దృష్టి సారిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






