ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్‌పై మెగాస్టార్ ప్రశంసలు

by Pulgam srinivas |

ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్‌పై చిరంజీవి, రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగాస్టార్ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉండడంతో దీనికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ట్రైలర్‌పై చిరంజీవి, రామ్ చరణ్ తమదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

చిరంజీవి "ట్రైలర్ తో మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి 'ఉస్తాద్ భగత్ సింగ్' తో అన్నీ శుభాలే!!" అంటూ ఓ పోస్ట్ చేశాడు. ఇక రామ్ చరణ్ "ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్వాగ్ తో ఫెంటాస్టిక్ గా ఉన్నారు. పవన్ గారిని ఎలా చూపించాలో హరీష్ శంకర్ కి బాగా తెలుసు" అంటూ పోస్ట్ చేసాడు. ఇప్పటికే చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ మూవీ మంచి విజయం సాధించడంతో మెగా ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు.

మరికొన్ని రోజుల్లో విడుదల కాబోయే పవన్ సినిమా గురించి ఇద్దరు హీరోలు పాజిటివ్గా స్పందించడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. మార్చి 19వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే పవన్, హరీష్ కాంబోలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

Next Story