అల్లు ఫ్యామిలీకి గట్టి కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్.. ఆ సినిమా హిట్ అవ్వడం చాలా హ్యపీగా ఉందంటూ..

by I. Sairam |

గత కొన్ని నెలలుగా మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అల్లు ఫ్యామిలీకి గట్టి కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్.. ఆ సినిమా హిట్ అవ్వడం చాలా హ్యపీగా ఉందంటూ..
X

దిశ, సినిమా: గత కొన్ని నెలలుగా మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిఠాపురం(Pithapuram) నుంచి పోటీ చేయగా.. అల్లు అర్జున్(Allu Arjun) అతనికి సపోర్ట్ చేయకుండా తన ఫ్రెండ్ అయినటువంటి వైసీపీ పార్టీకి చెందిన శిల్పా రవికి సపోర్ట్‌గా నిలిచి అతని పార్టీ తరఫున ప్రచారం చేశాడు. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య చిచ్చు రాజుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సందర్భంలో ఈ వార్ బయట పడుతూనే ఉంది.

అందులో భాగంగా రీసెంట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీ ప్లాప్ అయింది. అయితే ఓ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినిమా ప్లాప్ కావడం చాలా హ్యాపీగా ఉందని ఇన్ డైరెక్ట్‌గా తన ఒపినియన్ బయట పెట్టేశాడు. ఈ క్రమంలో చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ(Ram Narayana) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila). ఇక ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.

అయితే ప్రమోషన్లలో భాగంగా మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి పుష్ప మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. ఆయన మాట్లాడుతూ.. “అభిమానం అనేది పర్సనల్. మన మనిషి కాదని దూరం పెట్టడం కరెక్ట్ కాదు. హీరోలంతా ఒక్కటే, అందరూ ఇండస్ట్రీలో భాగమే అని మేసేజ్‌ని స్ప్రెడ్ చేయాలి. మన ఇమేజ్, ఫ్యాన్ బేస్ పెరగాలంటే మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప.. మనల్ని మనం దూరం చేసుకోవడం కాదు.

అందరూ కలిసిమెలిసి ఉండాలి. అలాగే ‘పుష్ప 2’(Pushpa-2) పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి నేను గర్విస్తాను. ఇండస్ట్రీలో ఒక సినిమా బాగా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఒక చిత్రం ఆడిందంటే ఎంతో మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి” అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. అల్లు ఫ్యామిలీకి గట్టి కౌంటర్ ఇచ్చారుగా అన్నా అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story