మోహన్ బాబు రిక్వెస్ట్‌ను లెక్కచేయని మెగాస్టార్.. ఇక జీవితంలో మోహం కూడా చూసుకోలేరా?

by Disha Web Desk 9 |
మోహన్ బాబు రిక్వెస్ట్‌ను లెక్కచేయని మెగాస్టార్.. ఇక జీవితంలో మోహం కూడా చూసుకోలేరా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోగా స్టేటస్ దక్కించుకున్నారు మోహన్ బాబు. ఈ హీరో వయసు మీద పడుతున్నా కూడా ఇప్పటికీ పట్టు వదలకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈయన కుమారులు(విష్ణు, మనోజ్) పరిశ్రమకు వచ్చి ఇన్నేళ్లైనా తమకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఈ విషయంలో మోషన్ బాబుకు కాస్త బాధగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల విష్ణు హీరోగా తెరకెక్కిన ‘జిన్నా’ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సారైన తన కుమారుడు మంచి సక్సెస్ సాధించాలని.. మోహన్ బాబు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో విష్ణును హీరోగా పెట్టి ‘కన్నప్ప’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నయనతార, మోహన్‌లాల్, శివ రాజ్ కుమార్ ఇలా ఎంతో మందిని ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించడానికి ఒప్పించారట. అలాగే మెగాస్టార్ చిరంజీవిని కూడా అప్రోచ్ అయ్యారట. కానీ చిరు కుదరదు బాబు.. నాకు డేట్స్ కుదరవు. ఏమి అనుకోవద్దు. అని చెప్పడంతో మోహన్ బాబు చాలా ఫీల్ అయ్యారట. ఇక గత ఏడాది ఎన్నికల్లో చిరు-మోహన్ మధ్య మాట మాట పెరిగి గొడవలైన విషయం తెలిసిందే. అలాగే విష్ణు కూడా మెగాస్టార్‌పై పరోక్షంగా కామెంట్స్ చేశాడని సోషల్ మీడియాలోని జనాలు చర్చించుకున్నారు. దీంతో చిరంజీవి కావాలనే మోహన్ బాబు సినిమాను రిజెక్ట్ చేశారంటూ టాక్. ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.


Next Story

Most Viewed