- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నడ బ్యూటీతో మెగాస్టార్ మాస్ స్టెప్పులు.. లేటెస్ట్ బజ్‌తో ఫ్యాన్స్‌లో కొత్త క్రేజ్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ (Vishvambhara).

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ (Vishvambhara). సోషియో-ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వశిష్ట (Director Vashishta) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో త్రిష కృష్ణన్, ఆషిక రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే.. ‘విశ్వంభర’ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ.. సినిమా నుంచి ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే రేంజ్‌లో ఏ ఒక్క అప్డేట్ రాలేదు. దీంతో అసలు సినిమా షూటింగ్ జరుగుతుందా.. ఆగిపోయిందా అనే డైలామాలో పడ్డారు అభిమానులు. ఈ క్రమంలోనే ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందులో చిరు పక్కన మాస్ స్టెప్పులు వెయ్యడానికి కన్నడ బ్యూటీ నిష్విక నాయుడు(Nishvika Naidu)ని ఎంపిక చేశారట. అంతే కాకుండా.. ఈ సాంగ్‌తో సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కానుందని తెలుస్తుండగా.. దీని నుంచి త్వరలో వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు ఫుల్ జోష్‌లో ఉన్నారట మేకర్స్.






