- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్దర్ అవార్డు గ్రహీతలకు మెగాస్టార్ చిరంజీవి విషెస్
ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులను(Gaddar Awards) తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులను(Gaddar Awards) తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. FDC చైర్మన్ దిల్‌రాజుతో కలిసి జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా ‘పుష్ప 2’ చిత్రానికి గానూ అల్లు అర్జున్ (Allu Arjun) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా ప్రభాస్ కల్కీతో పాటు మరో రెండు సినిమాలకు అవార్డులు లభించాయి. తాజాగా అవార్డు గ్రహీతలకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘అవార్డులు అందుకోబోతున్న విజేతలు అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి అవార్డులు నటుడికి రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం చాలా సంతోషం. ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రివర్గానికి, అధికారులకు ధన్యవాదాలు’ అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు. కాగా, ఈ అవార్డుల్లో మెగా డాటర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు రెండు పురస్కారాలు దక్కాయి. దాదాపు 14 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రభుత్వం ఇలా రాష్ట్ర అవార్డుల్ని ప్రకటించింది.
Hearty Congratulations to each and
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 29, 2025
every winner of the First #GaddarTelanganaFilmAwards
for the year 2024. 👏👏
State recognition is extremely precious and motivating for any Artiste and Technician in the Creative fraternity.
It’s greatly encouraging to see the Government of…






