- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మా తాత రసికుడు.. నాకు ఇద్దరు అమ్మమ్మలు’: మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంటబ్బాయి, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, జై చిరంజీవా వంటి సినిమాల్లో ఆయన చేసిన కామెడీ అంతా ఇంతా కాదు.. కమెడియన్‌లను మించి కడుపుబ్బా నవ్విస్తారనడంలో సందేహం లేదు. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ అంతే ఫన్నీగా ఉంటారు. కుటుంబ సభ్యుల బర్త్ ఫంక్షన్లలో కనిపించినప్పుడు, సినిమా ఆడియో ఫంక్షన్లలో పాల్గొనప్పుడు కూడా సరదా సరదాగా మాట్లాడుతూ.. అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా.. ఇదే తరహాలో మరోసారి మాట్లాడి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. హాస్య నటుడు బ్రహ్మానందం(Brahmanandam), ఆయన కుమారుడు గౌతమ్(Gautham) కలిసి నటించిన ‘బ్రహ్మ ఆనందం’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.
ఈ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ.. చిరంజీవి తాత ఫొటోను స్ర్కీన్‌పై వేసి ఆయన గురించి కొన్ని మాటలు చెప్పాలని రిక్వెస్ట్ చేయగా.. చిరంజీవి మాట్లాడారు. ‘మా అమ్మ తరచూ చెప్పేది.. నీకు ఎవరి బుద్ధులు వచ్చినా పర్లేదు కానీ మీ తాత బుద్ధులు రాకూడదు అనేది. ఎందుకంటే మాత రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు’ అని చిరంజీవి ఫన్నీగా మాట్లాడారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు బాస్ రూటే సపరేటు, బాస్ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం ఎవరి వల్లా కాదు అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
Mana Chiranjeevi Gari Thathagaru 😍@KChiruTweets #MegastarChiranjeevi pic.twitter.com/Za161Ht8oO
— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) February 11, 2025






