Breaking: మరోసారి సీఎం జగన్‌ను కలవనున్న చిరంజీవి

by Yella Dhawani Reddy |

Breaking: మరోసారి సీఎం జగన్‌ను కలవనున్న చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే. ఈ సంరద్భంగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను, సమస్యలను సీఎంకు వివరించానని చిరు చెప్పారు. సినిమా టికెట్‌ ధరల విషయంపై కొన్ని రోజులుగా అగమ్యగోచర పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణలో మాదిరి పూర్తి స్వేచ్ఛ కల్పించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అయితే, తాజాగా.. దీనిపై సిని'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతం అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. దానికీ, ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మరో కీలక ప్రకటన చేశారు. సినిమా టికెట్ల వ్యవహారంలో మరోసారి ఏపీ సీఎం జగన్‌ను కలువనున్నట్లు ప్రకటించారు.

Next Story