రేపు మీడియా ముందుకు మెగాస్టార్ చిరంజీవి

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-12 14:06:46  IST  )

రేపు మీడియా ముందుకు మెగాస్టార్ చిరంజీవి

రేపు మీడియా ముందుకు మెగాస్టార్ చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రేపు మీడియా ముందుకు రాబోతున్నారు. మనశంకర వరప్రసాద్ గారు చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. చిరంజీవితో పాటు చిత్ర దర్శకుడు అనిల్, నిర్మాతలు, హీరోయిన్‌లు, ఇతర తారాగణం పాల్గొంటారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ఫొటో కూడా విడుదల చేసింది. దీంతో చిరంజీవి ఏం మాట్లాడుతారు? అసలు సినిమా ఎలా ఉండబోతోందని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ‘శశిరేఖ’ సాంగ్‌ లిరికల్‌ వీడియో (Sasirekha Song)ను చిత్ర బృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను మధుప్రియతో కలిసి స్వీయ సంగీత దర్శకత్వంలో భీమ్స్‌ పాడారు. నెట్టింట వ్యూస్‌తో ఫుల్‌ వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ ట్రెసా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా, విక్టరీ వెంకటేష్ ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Next Story