- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Megastar Chiranjeevi: వరుస అప్డేట్స్‌తో మెగా గ్రాండ్ పార్టీ ఇస్తున్న చిరు.. మరో సినిమా అనౌన్స్‌మెంట్‌తో ఆనందంలో ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రాజెక్టుల నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రాజెక్టుల నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బర్త్ డే ట్రీట్‌గా ‘మెగా-157’ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘పండగకి వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వదిలిన గ్లింప్స్‌లో మెగాస్టార్ స్టైలిష్ లుక్‌కు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. షైన్ స్క్రీన్, హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.
ఇదిలా ఉంటే.. బర్త్‌డే స్పెషల్‌గా మరో బ్లాక్ బస్టర్ అప్డేట్ ఇచ్చాడు చిరంజీవి. తన 158వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ సర్‌ప్రైజ్ చేశాడు. ఈ మేరకు ‘నా ప్రియమైన బాబీ కొల్లితో మరోసారి జత కట్టడం సంతోషంగా అండ్ ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ ప్రత్యేక ప్రయాణంలో KVN ప్రొడక్షన్స్ తో చేతులు కలపడం ఆనందంగా ఉంది. MEGA158 ChiruBobby2’ అంటూ తెలిపాడు. ఇక డైరెక్టర్ బాబీ కొల్లి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మెగా 158 పోస్టర్ కూడా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేసింది. లింక్






