‘చాలా గర్వంగా ఉంది’.. శుభాంశు శుక్లాకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు

by Gantepaka Srikanth |

శుభాంశు శుక్లా(Subhanshu Shukla)కు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘చాలా గర్వంగా ఉంది’.. శుభాంశు శుక్లాకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: శుభాంశు శుక్లా(Subhanshu Shukla)కు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. భారతీయులంతా గర్వపడే క్షణమని పేర్కొన్నారు. ఎంతోమందికి శుభాంశు శుక్లా ఆదర్శంగా నిలిచారని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. కాగా, అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ చేపట్టిన మిషన్ విజయవంతం అయింది. నలుగురు వ్యామోగాములు సక్సెస్‌ఫుల్‌గా రోదసిలోకి దూసుకెళ్లారు. భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి. భారత్‌కు చెందిన శుభాంశు శుక్లాతో పాటు మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్‌ కపు (హంగరీ), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ- విస్నియెస్కీ (పోలండ్‌) రోదసిలోకి వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతరిక్షంలో ఆయనను ‘శుక్స్‌’గా పిలవనున్నారు. ట్వీట్

Next Story