ప్రాణం ఖ‌రీదుకు 47 ఏళ్లు..చిరంజీవి ట్వీట్ వైర‌ల్‌ !

by velandi.Saikiran |   (  Updated:2025-09-22 06:32:41  IST  )

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మార్చిన సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమా రిలీజ్ అయి... నేటికి 47 సంవత్సరాలు పూర్తయింది.

ప్రాణం ఖ‌రీదుకు 47 ఏళ్లు..చిరంజీవి ట్వీట్ వైర‌ల్‌ !
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవిలా కష్టపడ్డ నటీనటులు.. చూస్తే ఎక్కడ కనిపించరు. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మార్చిన సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమా రిలీజ్ అయి... నేటికి 47 సంవత్సరాలు పూర్తయింది.

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో పునాది రాళ్లు సినిమాకు మొదటి సంతకం చేసినప్పటికీ... ప్రాణం ఖరీదు సినిమా మొదట రిలీజ్ అయి సక్సెస్ అందుకుంది. సెప్టెంబర్ 22.. 1978 సంవత్సరంలో సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు K వాసు దర్శకత్వం అందించగా... కథ సి ఎస్ రావు అందించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, చంద్రమోహన్ కీలక పాత్రలో కనిపించారు. అప్పట్లో రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయి...47 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో... మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయని తెలిపారు. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పేర్కొన్నారు. క్లిక్

Next Story