- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి చిత్రం గ్రాండ్ ఓపెనింగ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా విక్టరీ వెంకటేష్..
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అండ్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) కలయికలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ పనులు నేడు(మార్చి30) ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అండ్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) కలయికలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ పనులు నేడు(మార్చి30) ప్రారంభమయ్యాయి. ఉగాది (Ugadi) పండుగ సందర్భంగా పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిపారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని తెరకెక్కించి.. బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు మెగాస్టార్‌తో జతకట్టాడు.
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. మెగా 157 ప్రాజెక్ట్ మూవీ లాంచ్ లో వెంకటేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరితో పాటుగా ఈ పూజా కార్యక్రమానికి సీనియర్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు (Senior famous director Raghavendra Rao), ప్రముఖ నిర్మాత మెగాస్టార్ చిరంజీవి బావ అల్లు అరవింద్ (Allu Aravind), ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్, దర్శకుడు బాబీ (Director Bobby), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela), వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) హాజరయ్యారు.
ఇకపోతే ఈ మూవీ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో వింటేజ్ చిరును చూస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతకుముందే చెప్పారు. ఈ మూవీని మెగాస్టార్ కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలు కూడా దగ్గరుండి మరీ జరిపించారు. ఇక భీమ్స్ సెసిరోలియో సంగీతాన్ని సమకూర్చనున్నారు.






