- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mega157: ముస్సోరీ షెడ్యూల్ పూర్తి.. Mega157 అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘Mega157’.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘Mega157’. నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ మేకర్స్ ముస్సోరీ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతార మీద కీలక సన్నివేశాలు షూట్ చేశారు.
ఈ సన్నివేశాలు సినిమాలో హైలెట్‌గా ఉండబోతున్నాయి. ఇక ముస్సోరీ షెడ్యూల్ పూర్తయినట్లు తెలుపుతూ అనిల్ రావిపూడి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశాడు. కాగా.. కమర్షియల్ ఫార్మాట్లలో హిలేరియస్ ఎంటర్‌టైనర్స్ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్ అయిన అనిల్ రావిపూడి ప్రమోషనల్ కంటెంట్‌ను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు Mega157 ప్రతి ప్రమోషనల్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే ముస్సోరీ షెడ్యూల్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్ అవతార్‌లో అలరించారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు రెట్టింపు కాగా.. ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.






