Varun Tej: ఐస్‌లాండ్‌లో భార్య లావణ్య త్రిపాఠితో జాలిగా గడుపుతోన్న వీడియో పంచుకున్న మెగా ప్రిన్స్

by Kodari Anjali |

సినీ ఇండస్ట్రీకి చెందిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లొట్టచెంపల సుందరీ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Varun Tej: ఐస్‌లాండ్‌లో భార్య లావణ్య త్రిపాఠితో జాలిగా గడుపుతోన్న వీడియో పంచుకున్న మెగా ప్రిన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీకి చెందిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లొట్టచెంపల సుందరీ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరు 2023 నవంబర్ 1న వివాహం చేసుకున్నారు.వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇరుకుటుంబీకుల నడుమ వీరి ప్రేమ చిగురించిన చోటే ఇటలీలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లైనప్పటి నుంచి ఈ జంట సమయం దొరికినప్పుడల్లా.. వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాల్దీవ్స్ వెకేషన్‌లో జాలిగా గడిపారు. ప్రస్తుతం లావణ్య గర్భవతిగా ఉంది. ఈ విషయాన్ని వరుణ్ అండ్ లావణ్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా వరుణ్ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇటీవల వరుణ్ భార్య కోసం పిజ్జా తయారు చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. లావణ్య తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇకపోతే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఐస్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ వెకేషన్ క్లిక్‌లను తాజాగా మెగా ప్రిన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. instagram link

Next Story