కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగా హీరో.. కృషి అండ్ ఐక్యత అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-01 06:48:28  IST  )

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగా హీరో.. కృషి అండ్ ఐక్యత అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’(Sambara Yetigattu) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు.

మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) నటిస్తోంది. అయితే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి(chaitanya Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సాయి ధరమ్ తేజ్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఈ రోజు కార్మికుల దినోత్సవ సందర్భంగా కార్మికులకు విష్ చేస్తూ.. ‘కృషి మరియు ఐక్యత కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Click For Tweet..

Next Story