తండ్రికి ఫాదర్స్ డే విషెస్ తెలిపిన మెగా హీరో.. నీ ప్రేమ నిశ్శబ్ద బలం అంటూ ఎమోషనల్ పోస్ట్

by Gugulothu.Kavitha |

మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తండ్రికి ఫాదర్స్ డే విషెస్ తెలిపిన మెగా హీరో.. నీ ప్రేమ నిశ్శబ్ద బలం అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ముకుంద’(Mukundha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతను.. ‘కంచె’(Kanche) మూవీతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ హీరోగా రాణిస్తున్నాడు. అయితే చివరిగా నటించిన ‘మట్కా’(Matka) మాత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

దీంతో మంచి బ్లాక్ బస్టర్ కల్ట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా ఎన్నడూ ట్రై చేయని జోనర్‌తో మన ముందుకు రాబోతున్నాడు. ‘వీటీ-15’(VT-15) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇండో - కొరియన్ హారర్ కామెడీ థ్రిల్లర్‌తో రాబోతోంది. ఇక ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ యూవీ క్రియేషన్స్(UV Creations) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే.. నేడు ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు తమ తండ్రులకు స్పెషల్ విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వరుణ్ తేజ్ కూడా తన తండ్రితో దిగిన క్యూట్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘తండ్రి ప్రేమ నిశ్శబ్ద బలం, ఎల్లప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ అనుభూతి చెందుతుంది. నాన్నా.. హ్యాపీ ఫాదర్స్ డే’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

Instagram Link

Next Story